Newdelhi, June 10: అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను (Biparjoy Cyclone) మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Cyclone Biparjoy Turns Into "Very Severe Cyclonic Storm", States On Alert https://t.co/iTrdDSex8v
— Amit Sharma (@amitsharmalie) June 8, 2023
బిపర్ జోయ్ అంటే అర్థం ఏమిటంటే?
ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. విపత్తు అని దీని అర్థం.