Hyderabad, Nov 3: అగ్రరాజ్యం అమెరికా (USA) వీసా ఇంటర్వ్యూ (Visa Interview) కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు (Indians) అమెరికా రాయబార కార్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. వారాంతంలో 2.5 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్ మెంట్లను ఓపెన్ చేసినట్టు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. తమ కాన్సులర్ బృందానికి ఇది బిజీ వారమని తెలిపింది. https://www.ustraveldocs.com/in/en పై అపాయింట్ మెంట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఫలితంగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలైన బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) ఇంటర్వ్యూ కోసం వేచి చూసే సమయం భారీగా తగ్గింది.
It was a busy weekend for our consular team! Over the weekend we opened over a quarter million nonimmigrant visa appointments!
Book yours today at https://t.co/SbQkOpI9vq #HereToServe
— U.S. Embassy India (@USAndIndia) November 1, 2023
ఏ నగరాల్లో ఎంత తగ్గిందంటే?
- ఢిల్లీలో గతవారం 542 రోజులుగా ఉన్న వెయిటింగ్ టైమ్ ఇప్పుడు 37 రోజులకు తగ్గింది.
- కోల్ కతాలో 539 నుంచి 126 రోజులకు తగ్గింది.
- ముంబైలో 596 నుంచి 322 రోజులకు తగ్గింది.
- చెన్నైలో 526 నుంచి 341 రోజులకు భారీగా తగ్గింది.
హైదరాబాద్ లో ఇలా..
అన్ని నగరాలకు విరుద్ధంగా హైదరాబాద్ లో కొన్ని రోజులు అదనంగా పెరిగాయి. గతవారం వెయిటింగ్ సమయంలో 506 రోజులు ఉండగా ఇప్పుడది 511 రోజులకు పెరగడం గమనార్హం. ఇదిలావుండగా ఈ ఏడాది అమెరికా, భారతీయులకు సంబంధించిన 10 లక్షలకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. కరోనా ముందు కంటే ఇది 20 శాతం ఎక్కువని ఎంబసీ అధికారులు తెలిపారు.