Representative Image

Newdelhi, Nov 3: కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు (Road Accidents) సంబంధించిన డేటాను (Data) విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య 94,009 ప్రమాదాలు రికార్డయ్యాయి. ఈ సమయంలో జరిగిన ప్రమాదాలు దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 20శాతానికిపైగా ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల అత్యల్పంగా ప్రమాదాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. 2022 సంవత్సరంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 94,009 రోడ్డు ప్రమాదాలు రికార్డయ్యాయి.

Dalit Woman Raped: దళిత మహిళను రేప్‌ చేసి.. మూడు ముక్కలుగా నరికి చంపిన దుండగులు.. యూపీలో ఘోరం

ఎంత మంది చనిపోయారంటే?

కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలో 4,43,366 మంది గాయపడ్డారు. నివేదిక ప్రకారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సమయంలో 79,639 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.