Cylinder Price: చిరు వ్యాపారులకు ఊరట.. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Cylinder Price: చిరు వ్యాపారులకు ఊరట..  తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు
Commercial LPG (File: Google)

Hyderabad, November 1: వాణిజ్య సిలిండర్ల (Commercial Cylinder) వినియోగదారులకు (Consumers) ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,744కి, ముంబయిలో రూ. 1,696కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.

 

(The above story first appeared on LatestLY on Nov 01, 2022 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).