Kerala Stampede (PIC@ ANI X)

Kochi, NOV 25: కేరళలోని కోచ్చిలోని కుసాట్ యూనివర్సిటీ కాలేజీలో (CUSAT University) జరిగిన ఓ కన్సర్ట్‌ విషాదం మిగిల్చింది. ఈ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో (Stampede) నలుగురు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జి (Veena George) ఈ సంగతి ధ్రువీకరించారు. కలామస్సెరీ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. క్యాంపస్ లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిఖితా గాంధీ అనే సంగీత దర్శకుడు ఈ కన్సర్ట్ (Concert) నిర్వహించారు.

 

ఈ కన్సర్ట్ (Concert) నిర్వహణకు కలామస్సెరీ మెడికల్ కాలేజీ యాజమాన్యమే ఏర్పాట్లు చేసిందని మంత్రి వీనా జార్జి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.