ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ప‌లువురు అధికారులు హాజ‌రుకానున్నారు(TG Cabinet Meet Today). ఈ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు(Telangana Cabinet Meet). అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్‌లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

రెండో దశ సమగ్ర కులగణనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది . సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవగా దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఏపీతో నీటి వివాదం వంటి అంశాలపై చర్చించనుంది కేబినెట్.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)