News

Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్‌‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Viral Video: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నాగచైతన్య - శోభిత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం...వీడియో ఇదిగో

Arun Charagonda

అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pushpa 2 Premiere: నాకు లివర్ దానం చేసింది...ఇప్పుడు తనే లేకుండా పోయింది, రేవతి మృతిపై భర్త భాస్కర్ ఆవేదన, నా కష్టం ఎవరికి రావొద్దని కన్నీటి పర్యంతం

Arun Charagonda

పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చిన ఓ మహిళ మృతి చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము...ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.

Maoists Bandh: డిసెంబర్ 9న తెలంగాణ బంద్‌...చెల్పాక ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Arun Charagonda

ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Hanamkonda: అపచారం..మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వసం చేసిన దుండగులు, హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఘటన...భక్తుల ఫైర్

Arun Charagonda

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు.

Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్‌ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.

Telangana: మార్ఫింగ్ ఫోటోలతో సంపన్నులను బ్లాక్ మెయిల్, వేమలవాడలో కిలేడి హోమ్ గార్డును అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

Opposition MPs Protest: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్

Arun Charagonda

పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు. అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

University Of Buckingham: హైదరాబాద్‌ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే

Arun Charagonda

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో బకింగ్‌హామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేమ్స్ టూలీపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాదు విచారణలో యూనివర్శిటీ ఫీజు చెల్లించడంలో అతడు ఆమెకు సహాయం చేసినట్లు సమాచారం. 65 ఏళ్ల ప్రొఫెసర్ టూలీతో తనకు లైంగిక సంబంధం ఉందని భారతీయ మహిళ తన డైరీలో పేర్కొంది. యువతి రాసిన డైరీల కాపీలను ప్రొఫెసర్ భార్య యూనివర్సిటీకి అందజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం

Hazarath Reddy

కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాలని ఓ గురువు కామాంధుడుగా మారాడు. విద్యార్థినికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ సస్పెండ్ కు గురి అయ్యాడు.

AEE Nikesh Kumar: ఏఈఈ నిఖేశ్ కుమార్ కేసు అప్‌డేట్, బ్యాంకు లాకర్లలో 2 కిలోల బంగారం, డైమండ్స్ గుర్తింపు

Arun Charagonda

AEE నిఖేశ్ కుమార్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. నిఖేశ్ కుమార్‌ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు లభించగా దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్‌ ఇతర ఆభరణాలు గుర్తించారు. కేవలం 2 లాకర్లు మాత్రమే నిఖేశ్ పేరు పై ఉన్నట్లు గుర్తించగా మిగతా 16 స్నేహితులు , కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

RBI Repo Rate Unchanged: వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం, మరో 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసిన ఆర్భీఐ

Hazarath Reddy

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిపింది.ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) నేడు వెల్లడించారు.ఈ సందర్భంగా వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

Advertisement

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, పెళ్లికి వెళ్లి వస్తుండగా చెట్టును ఢీకొట్టిన కారు, ఆరుగురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో శుక్రవారం (డిసెంబర్ 6) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పిలిభిత్‌లో, నియోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో 11 మందితో కూడిన కారు చెట్టును ఢీకొట్టింది, ఫలితంగా ఆరుగురు మరణించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Telangana Benefit Shows: పుష్ప 2 ఎఫెక్ట్..తెలంగాణలో ఇక బెనిఫిట్‌ షోలు బంద్..మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన

Arun Charagonda

పుష్ప 2 ఎఫెక్ట్...మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు బంద్ అని తేల్చిచెప్పారు. సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Ponnam Prabhakar: కేసీఆర్, కిషన్ రెడ్డి ఇప్పటివరకు కుల సర్వేలో పాల్గొనలేదు, అభ్యంతరాలుంటే చెప్పాలి కానీ కుల సర్వేపై అసత్య ప్రచారం తగదన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని... రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

CM Revanth Reddy: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్...స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.

Advertisement

HYDRA Demolitions: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. స్థానికంగా ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Driving License Revoke: తాగి నడిపితే లైసెన్స్‌ రద్దే.. అతివేగంగా, అధిక లోడ్‌ తో వెళ్లినా ఇక కఠిన చర్యలే.. రవాణాశాఖకు పోలీసుల సిఫార్సు

Rudra

మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సదరు వాహనదారుడి లైసెన్స్‌ కూడా రద్దు కానున్నది. అంతేకాదు అధిక వేగం, బరువుతో గూడ్స్‌ వెహికల్స్‌ నడిపినా లైసెన్స్‌ రద్దు అవుతుంది.

SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Leopard on Flyover: ప్లై ఓవర్‌పై చిరుత పులి.. హడలిపోయిన వాహనదారులు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.

Advertisement
Advertisement