News
Andhra Pradesh: వీడియో ఇదిగో, మార్కాపురంలో మహిళలపై కత్తులతో టీడీపీ కార్యకర్తలు దాడి, వీడియోని షేర్ చేస్తూ ఘాటు విమర్శలు చేసిన వైసీపీ
Hazarath Reddyఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్ చేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు.
Cracks Appear on Walls of Taj Mahal: మాహాద్భుత కట్టడం తాజ్ మహల్ గోడలకు పగుళ్లు.. పలు చోట్ల దెబ్బతిన్న ఫ్లోరింగ్
Rudraప్రేమకు చిహ్నం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది ఏటా పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్ మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది.
Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)
Rudraహైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.
Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్
Rudraవరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Snake Inside Garib Rath Express: ఏసీ ట్రైన్ కోచ్ లో పాము.. గరీబ్ రథ్ రైలులో ఘటన.. ప్రయాణికుల కేకలు (వీడియో)
Rudraఇప్పటివరకూ జనావాసాల్లోకి వచ్చిన పాములు.. ఇప్పుడు ఏకంగా ట్రైన్ లో ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్నాయి. గరీబ్ రథ్ రైలులో ఇటీవల ఓ పాము ప్రత్యక్షం అయ్యింది.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
US Presidential Election 2024: వచ్చే నవంబర్ లో జరిగే ఎన్నికల్లో నేను గనుక ఓడిపోతే ఇకపై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
Rudraమరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ శక్తినంతా ధారపోస్తున్నారు.
Kangana Ranaut Comments on Sonia: హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న నిధులను సోనియాకు పంపుతున్నారు! ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
VNSకాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై (Sonia Gandhi) హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (Himachal Pradesh Government) దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిధులను సోనియాగాంధీకి పంపుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం, అభిమానుల తాకిడితో నిర్వాహకులు ఏం చేశారో తెలుసా
VNSపరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు.
Tirumala Shanti Homam : తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, తిరుమల దేవస్థానంలో శాంతిహోమం,
VNSతిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో (Tirumala) ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు.
Israeli Air Strike On School: గాజాలో స్కూల్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావహంగా దృశ్యాలు
VNSగాజా నగరంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్ ఖాస్సెమ్ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేంకటేశ్వర ఆలయానికి పోరాటాసి మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పోరాటాసి మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై వెలిశాడని ప్రతీతి.
Astrology: అక్టోబర్ 9 నుండి గురు గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ 3 రాశులు వారు మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శుభకరమైన గ్రహంగా గురుడు చెప్పవచ్చు. విద్యకు పిల్లలకు సంపదకు కీర్తి ప్రతిష్టలకు మొదలైన కారణం కలిగి ఉంటుంది.
Astrology: స్వాతి నక్షత్రం లోనికి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం చాలా మంచి గ్రహం. ఇది మన జీవితాల్లో ముఖ్యమైన విషయాలకు సంబంధించి విజయాన్ని అందించే గ్రహం.
Megastar Chiranjeevi : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్, అరుదైన గౌరవం దక్కించుకున్న చిరంజీవి
Arun Charagondaఅన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి.
Astrology: సెప్టెంబర్ 23 నుండి బుధుడి సంచారం ఈ మూడు రాశుల వారికి గోల్డెన్ టైం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడికి ఇష్టమైన గ్రహం బుధ గ్రహం. ప్రస్తుతం బుధ గ్రహం సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 23 సోమవారం 10 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి
Arun Charagondaతిరుమల లడ్డు కల్తీపై చంద్రబాబు ఆరోపణలను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ఈ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని, ఆరోపణలు నిజమైతే అందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకుని చావాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోపణలు అబద్ధం అయితే ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును శిక్షిస్తాడు అన్నారు.
Health Tips: రాత్రి భోజనం తర్వాత ఎన్ని గంటల గ్యాప్ తర్వాత నిద్రపోవాలో తెలుసా.
sajayaచాలామంది చేసే పని రాత్రిళ్ళు భోజనం చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.