వార్తలు

Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, భార్యాభర్తల గొడవను తీర్చడానికి వెళ్లిన పోలీసును అమ్మనాబూతులు తిట్టిన భర్త, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, పోలీసు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అతని భార్య మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు, అతని గుర్తింపును బహిర్గతం చేయని ఓ వ్యక్తి వీడియోలో " తేరీ మా చ్** దుంగా "తో సహా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం వీడియోలో కనిపించింది.

Hoarding Collapse in Thane: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ హోర్డింగ్ కూలి మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని అధికారి తెలిపారు. డోంబివిలి ప్రాంతంలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి గాయాలు అయినట్లు నివేదికలు లేవని ఆయన తెలిపారు.

Road Accident Video: వీడియో ఇదిగో, రాయదుర్గంలో వేగంగా వచ్చి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు, స్పాట్‌లోనే స్టూడెంట్ మృతి

Hazarath Reddy

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Andhra Pradesh Shocker: నంద్యాలలో ఘోర విషాదం, అర్థరాత్రి మట్టి మిద్దె కుప్పకూలడంతో నిద్రలోనే కుటుంబం మృత్యువాత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నంద్యాలజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్‌ నేతల నిరాశ

Arun Charagonda

ఫిరాయింపులు , బుజ్జగింపులు వెరీసీ తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి బీఆర్ఎస్ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో టిఫిన్ చేస్తూ జరిగిన చర్చల ఫలితం 24 గంటలు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

Bomb Threat in Delhi: ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు

Rudra

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Man Buried Alive: ఇదెక్కడి ఘోరం..? భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన దుండగులు.. వీధి కుక్కలు తవ్వడంతో బతికి బయటపడ్డ బాధితుడు.. ఆగ్రాలో ఘటన

Rudra

యూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. భూవివాదంలో గొడవ ముదరడంతో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే, అనూహ్యంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వడంతో అతను బయటపడ్డాడు.

Jurala Project: జురాలకు పోటెత్తిన వరద, 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, పోటెత్తిన పర్యాటకులు

Arun Charagonda

మహబూబ్‌నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్ ఫ్లో: 3,25,000 వేల క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 3,11,734 వేల క్యూ సెక్కులుగా ఉంది.

Advertisement

Rahul Gandhi: నాపై ఈడీ దాడికి ప్లాన్.. చక్రవ్యూహం వ్యాఖ్యలే దీనికి కారణం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rudra

ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) త‌న‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోంద‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఈడీలో ప‌నిచేస్తున్న కొంద‌రు ఉన్నతాధికారులు త‌న‌కు స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

YS Jagan Passport Renewal: భార్య వైఎస్ భారతితో కలిసి పాస్‌ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

Rudra

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాస్‌ పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌ పోర్టు కార్యాలయానికి వచ్చారు.

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్‌ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.

Advertisement

TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన

Rudra

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు గత ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్‌ ను నేటి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రకటించబోతున్నది.

Raj Tarun Case: లావ‌ణ్య కేసులో హైకోర్టును ఆశ్ర‌యించిన హీరో రాజ్ త‌రుణ్, విచార‌ణ రేప‌టికి వాయిదా

VNS

ముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

GHMC Rain Alert: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రెయిన్ అల‌ర్ట్, రెండు రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రిక‌

VNS

బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

Kalki Ticket For Rs 100 Only: క‌ల్కీ మూవీ టికెట్ కేవ‌లం రూ.100 మాత్ర‌మే, దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైజ‌యంతి మూవీస్

VNS

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Advertisement

Bhumata Portal: ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తిరిగి తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్​లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన సంగతి విదితమే.

TG Job Calendar: తెలంగాణ యువ‌త‌కు గుడ్ న్యూస్, రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌భుత్వం

VNS

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను (Job Calender) కేబినేట్ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 2వ తేదీన అసెంబ్లీ (Assembly) వేదిక‌గా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Wayanad Landslide Death Toll: వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, వరదలో కొట్టుకువస్తున్న మృతదేహాలు, 281కి పెరిగిన మరణించిన వారి సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 281 కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ అపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అక్కడ సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటుచేసుకుంటున్నాయి

Skill University: హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌కు జోడీగా మ‌రో సిటీ, కందుకూరు ద‌గ్గ‌ర కొత్త న‌గ‌రం రూపుదిద్దుకోబోతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి

VNS

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో స్కిల్ యూనివర్సిటీకి (Skill University) సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ వర్సీటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేసింది ప్రభుత్వం.

Advertisement
Advertisement