Documents For It Returns: ఐటీ రిటర్న్‌ ఫైల్ చేస్తున్నారా? అయితే ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి! ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ
It Returns Filing (PIC@ Pixabay)

New Delhi, April 28: వేతన జీవులు, బుల్లి వ్యాపారులు, కార్పొరేట్ సంస్థల వరకు ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ (It Returns) దాఖలు చేయాల్సిందే. ప్రతి ఏటా సాధారణంగా జూలై నెలాఖరు వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు. కనుక గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది. గతంలో ఐటీ రిటర్న్స్ (It Returns Filing) దాఖలు చేయాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ల సాయం తీసుకోవాల్సి వచ్చేది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ఎంతో సౌకర్యవంతంగా మారిందని చెబుతున్నారు. ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్‌లో ఐటీఆర్ (ITR) ప్రక్రియ సరళతరం చేశారు. కనుక వేతన జీవులైనా.. వ్యాపారులైనా.. కన్సల్టెంట్లయినా సొంతంగానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అయితే, ప్రతియేటా ఆదాయం పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొన్ని కీలక పత్రాలు అవసరం. వేతన జీవులు పని చేసే సంస్థల యాజమాన్యాలు ఇచ్చే ఫామ్-16, ఏఐఎస్/ టీఐఎస్, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఇతర పెట్టుబడి పథకాల్లో మీ పెట్టుబడులకు వచ్చిన మూల ధన పెట్టుబడి, డివిడెండ్లు, ఇంటి అద్దె ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పిల్లలకు ట్యూషన్ ఫీజు చెల్లింపులు, సొంతింటి రుణం ఈఎంఐ చెల్లింపుల పత్రాలు, బీమా పాలసీ ప్రీమియం పేమెంట్స్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి.

Indian Business Leaders Decision Making Survey: రానున్న రోజుల్లో ఆ పని కూడా రోబోలదే! క్రమంగా మారుతున్న బిజినెస్‌ లీడర్ల ఆలోచనలు, కీలక నిర్ణయాల్లోనూ రోబోలదే కీలక పాత్ర 

గత ఆర్థిక సంవత్సరంలో టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (TDS).. ఎక్కడెక్కడ వర్తిస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ వివరాలన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. మీరు పొందే వేతనం, ఫామ్-16లో వెల్లడించిన వివరాలు సమానంగా ఉన్నాయా.. అన్ని రకాల డిడక్షన్లు రిజిస్టర్ చేశారా.. ఏమైనా తేడాలు ఉన్నాయా.. అని ఒకసారి పరిశీలించుకుని మీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలి.

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్, ఒకే ఫోన్‌ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు 

ఫామ్-16తోపాటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS) వివరాలు పరిశీలించుకోవాలి. దీంతోపాటు 26ఎఎస్‌నూ చెక్ చేసుకోవాలి. ఇందులో మీ ఇన్ కం, పే చేసిన టాక్స్ డిటైల్స్ ఉంటాయి. ఈ పత్రాలన్నీ డౌన్ లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీకు వచ్చే ప్రతి ఆదాయం గుర్తిస్తేనే వాటిని బట్టి సరైన ఐటీ రిటర్న్స్ ఫామ్ (It Returns Filing) ఎంచుకోవచ్చు. కేవలం శాలరీ ఆధారిత ఆదాయం మాత్రమే ఉంటే ఐటీఆర్-1 ఎంచుకుంటే సరిపోతుంది. పెట్టుబడిపై లాభాలు, ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు ఐటీఆర్-2 గానీ, ఐటీఆర్-3 గానీ ఎంచుకోవాలి. కనుక ఆదాయం లెక్క గట్టడంలో పొరపాట్లకు తావివ్వవద్దు.

Spotify Down: ప్రపంచ వ్యాప్తంగా స్పాటిఫై మ్యూజిక్ సర్వీసులు డౌన్, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులతో హెరెత్తించిన నెటిజన్లు, పరిశీలిస్తున్నామని తెలిపిన కంపెనీ 

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందు ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న కాలిక్యులేటర్ సాయంతో ఎంత పన్ను పే చేయాలి.. ఎంత రీఫండ్ అవుతుందన్న అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావాలి. పన్ను పే చేయాల్సి వస్తే.. రిటర్న్స్‌తోపాటు ఆ పని కంప్లీట్ చేసేయాలి. లేకపోతే రిటర్న్స్ చెల్లుబాటు కాకపోయే చాన్స్ ఉంది. ఇక పన్ను పొదుపు చేయడానికి మీరు పెట్టిన పెట్టుబడులు, ఇతర ఖర్చులు జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. సెక్షన్ 80సీ, 80డీ, 80జీ సెక్షన్ల నమోదు విషయమై ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో మరో కీలకాంశం ఉంది. ప్రస్తుతం అమలులో పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నాయి. 2023-24 అంచనా సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలులో కొత్త పన్ను విధానాన్ని ‘డిఫాల్ట్’ ఆప్షన్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త ఐటీ విధానం కింద పన్ను మినహాయింపులు ఉండవు. పాత పన్ను విధానం కింద అన్ని రకాల మినహాయింపులు వాడుకోవచ్చు. మీ ఆదాయం, భవిష్యత్ అవసరాలను బట్టి కొత్త, పాత ఐటీ విధానాల్లో మీకు ఉపయోగకరమైన పాలసీని ఎంచుకుని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.