New Delhi, April 26; రానున్న రోజుల్లో రోబోలే అన్ని రంగాలను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కారణంగా వేలాది ఉద్యోగాలు ఊడుతాయని ఊహాగానాలు వస్తున్నాయి. చాట్ జీపీటీ తరహా సేవలతో ప్రజలకు కావాల్సిన అన్ని పనులు చకచకా అయిపోతున్నాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) క్రమంగా కంపెనీల నిర్ణయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. 87 శాతం బిజినెస్ లీడర్లు తాము తీసుకునే నిర్ణయాల్లో (Decision Making) రోబోలకే (Robot) ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. తాము నిర్ణయం తీసుకోవడం కంటే రోబోలు తీసుకోవడమే మేలని వారు భావిస్తున్నారు. ఒరాకిల్ అండ్ ఆథర్ సెత్ స్టెఫెన్స్ డేవిడోవిట్స్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో (Decision Making Survey) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
AI for Decision Making: 87% Indian Business Leaders Would Let Robots Make Their Decisions, Says Study #Robot #Business https://t.co/lF0jGRfges
— LatestLY (@latestly) April 26, 2023
90 శాతానికి పైగా బిజినెస్ లీడర్లు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో పడిపోయారని, వారు డెసిషన్ స్ట్రెస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. వారు తీసుకునే నిర్ణయాలను ఎవరైన ఎదురు ప్రశ్నిస్తారన్న అనుమానం, గతంలో తీసుకున్న నిర్ణయాల పట్ల కాస్త ఇబ్బందికరంగా ఫీలవుతున్నట్లు స్డడీలో తేలింది. అంతేకాదు 82 శాతం మంది తాము తీసుకునే నిర్ణయాలపై నమ్మకం లేకపోవడాన్ని కూడా గుర్తించారు. ఈ సర్వేలో 17 దేశాలకు చెందిన మొత్తం 14వేల మంది పాల్గొన్నారు. అందులో వెయ్యిమంది భారతీయులు కూడా ఉన్నారు. దీంతో ఈ సమస్య ప్రపంచదేశాలతో పాటూ భారత్ లోని బిజినెస్ లీడర్లు (Indian Business Leaders) కూడా ఎదుర్కుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
రోబోలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయన్న ఆత్మనూన్యతా భావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. 88 శాతం మంది బిజినెస్ లీడర్లు తాము తీసుకునే నిర్ణయాలు జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు నిర్ణయాలు తీసుకునే సమయంలో కాస్త ఒత్తిడికి లోనవుతున్నారు. గత మూడేళ్లలో ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఈ మూడేళ్లలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించే విధానంలో 98 శాతం మందిలో మార్పు వచ్చింది. 51 శాతం మంది మాత్రం తమకు నమ్మకస్తులైనవారి మాటలను బట్టి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు స్డడీలో వెల్లడైంది.