Bank Holidays In May: మే నెలలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్‌, ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి! బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ మీకోసం

దేశంలో వివిధ పండుగలు (May Holidays), పర్వదినాలు, ఇతర కారణాల దృష్ట్యా బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. వారాంతపు సెలవులతో (Weekends) పాటు దేశమంతా వివిధ ప్రాంతాల్లో మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా మే నెలలో 12 రోజులు బ్యాంకులు పని చేయవు.

Bank Holidays In May: మే నెలలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్‌, ఈ రోజుల్లో బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి! బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ మీకోసం
Bank Holidays In May (PIC@ pixabay)

New Delhi, April 29: దేశంలో వివిధ పండుగలు (May Holidays), పర్వదినాలు, ఇతర కారణాల దృష్ట్యా బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. వారాంతపు సెలవులతో (Weekends) పాటు దేశమంతా వివిధ ప్రాంతాల్లో మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా మే నెలలో 12 రోజులు బ్యాంకులు పని చేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా మే1వ తేదీ దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటారు. కనుక మేడేతో ఈ నెల ప్రారంభం అవుతోంది. మే1వ తేదీన మేడే (May day).. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి.. 

మే5వ తేదీన బుద్ధ పౌర్ణమి (Buddha Purnima) సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్ కత్తా, ముంబై, నాగాపూర్, న్యూఢిల్లీ, రాయ్ పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మే7వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని కోల్ కత్తాలో సెలవు ఉంటుంది. మే13వ తేదీన రెండో శనివారం దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే14వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే16వ తేదీన సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాంగ్ టక్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Scorching Heat In May: మేలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి.. భారత వాతావరణ శాఖ అంచనా 

మే20వ తేదీన నాలుగో శనివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే21వ తేదీన ఆదివారం దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే22వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు ఉంటుంది. మే28వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. మే నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. మే20వ తేదీ నాలుగో శనివారం, మే21వ తేదీన ఆదివారం, మే22వ తేదీ మహారాణా జయంతి సందర్భంగా బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Apr 29, 2023 11:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).