mobile using (Photo-ANI)

కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఓ నకిలీ ఎస్‌ఎంఎస్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్‌ యోజన కింద అర్హులైన వ్యక్తులకు నెలవారీగా ఆకర్షణీయమైన శాలరీ వస్తుందని.. ఇందుకోసం కింద పేర్కొన్న లింక్‌పై క్లిక్‌ చేయాలంటూ వస్తోన్న సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్‌ యోజన కింద రూ.78,856ల శాలరీకి మీరు ఎంపికయ్యారు.

దేశంలో చివరి దశకు చేరుకున్న కరోనా, కొత్తగా 5910 మందికి కోవిడ్, మరో 53,974 కేసులు యాక్టివ్‌

ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే నెలకు రూ.50వేలు చొప్పున ఆదాయం పొందొచ్చంటూ ఉన్న స్క్రీన్‌ షాట్‌ని కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. ఇది పూర్తిగా నకిలీ సందేశమని.. ఇలాంటివాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Here's PIB Tweet

అలాంటి పథకమేదీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయడంలేదని స్పష్టం చేసింది.