Patna, Dec 12: బీహార్‌లోని ఛప్రాలో కొత్త ప్రేమ కథ బయటకు వచ్చింది.ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు బావిలో దూకాడు. బీహార్ చాప్రా జిల్లాలోని మోతీరాజ్‌పూర్ లో ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో స్థానికులు అతడిని పట్టుకుని కొట్టారు.
అయితే ప్రేమికుడు గ్రామస్తుల నుంచి తప్పించుకుని (man chased by girlfriend's family) పారిపోయాడు. అతన్ని వారు వెంబడించడంతో నేరుగా సమీపంలోని బావిలో (jumps into well) దూకేశాడు. మూడు నిమిషాల్లో పెళ్లి చేయకుంటే బావిలోనే చనిపోతానని ప్రేమికుడు చెప్పాడు. గ్రామస్తులు భయాందోళనకు గురై మూడు నిమిషాల్లో అతని సలహాను మన్నించి ప్రియురాలికి పెళ్లి (gets married next day ) చేశారు.
గర్ఖా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతిరాజ్‌పూర్‌కు చెందిన యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి గ్రామానికి చేరుకున్నట్లు సమాచారం. గ్రామానికి చేరుకోగానే స్థానికులు ప్రేమికుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. కాగా, ప్రియురాలిని పెళ్లి చేసుకునే విషయమై ప్రేమికుడు మాట్లాడగా, స్థానిక గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం బావిలోకి దూకాడు. ఎలాగోలా ఒప్పించి ప్రేమికుడిని బయటకు తీశారు, ఆ తర్వాత ప్రియురాలితో నాకు పెళ్లి చేస్తేనే బావిలో నుంచి బయటకు వస్తానని ప్రేమికుడు కండిషన్ పెట్టాడు. తర్వాత ఇద్దరికీ పెళ్లయింది. ఈ పెళ్లిలో ప్రేమికుడి బంధువులు ఎవరూ పాల్గొనలేదు. మూడు నిమిషాల షరతుతో నాలుగేళ్ల ప్రేమాయణం పూర్తయింది.
నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్లా తెల్పా నివాసి అయిన ప్రేమికుడి పేరు మున్నా రాజ్ అని స్థానికులు తెలిపారు. ఆ అమ్మాయి పేరు సోని కుమారి, మోతిరాజ్‌పూర్‌లో ఆమె ఇల్లు ఉంది. వీరిద్దరి మధ్య నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. బంధువులు పెళ్లికి సిద్ధం కావడం లేదని, ఆ తర్వాత అబ్బాయి స్వయంగా అమ్మాయి వద్దకు చేరుకుని బావిలో దూకాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం స్థానికులు, బంధువులు ఇద్దరికీ పెళ్లి చేశారు.