New Delhi, OCT 19: సోనియాగాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని (Congress president) చేపట్టబోయేది ఎవరనేది కొన్నిగంటల్లో తేలనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు వేసిన ఓట్లను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో (AICC Office) లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 68 పోలింగ్ బూత్‌ల నుంచి బ్యాలెట్ పెట్టెల్ని సీల్ చేసి ఏఐసీసీ కార్యాలయంకు తరలించారు. వీటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. సాధారణ ఎన్నికల తరహాలోనే బ్యాలెట్ పెట్టెలను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బుధవారం ఉదయం 10గంటలకు తెరుస్తారు. తర్వాత బ్యాలెట్లను కలగలిపి కట్టలు కడతారు. అనంతరం వాటిని లెక్కిస్తారు (Counting). ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు ప్రక్రియ.. సాయంత్రం వరకు సాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Congress party to get its first non-Gandhi president in 24 years today; Counting of votes will begin at 10am at the AICC headquarters in Delhi.
Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.
(file pics) pic.twitter.com/CcbyGrVg83
— ANI (@ANI) October 19, 2022
సోమవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలో మొత్తం 9,915 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులలో 9,500 కంటే ఎక్కువ మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలో ఖర్గే నే విజేతగా నిలుస్తాడని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఖర్గే (Kharge), శశి థరూర్ (Shashi Tharoor) ఇద్దరూ పార్టీలో సీనియర్లే. వారిద్దరికి మంచి పలుకుబడి ఉంది. అయితే ఖర్గే వైపే ఎక్కువ మంది ప్రతినిధులు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మరోవైపు గాంధీ కుటుంబంకూడా (Gandhi Family) ఖర్గే వైపే ఉన్నట్లు ప్రచారం జరిగింది. గెహ్లాట్ (Gehlot) పోటీకి విముఖత చూపడంతో గాంధీ కుటుంబమే ఖర్గే పేరును తెరపైకి తెచ్చిందని పలువురు కాంగ్రెస్ నాయకులు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. గతంలో, 1998లో సోనియా గాంధీ (Sonia Gandhi) జితేంద్ర ప్రసాద్‌ను ఓడించి డిసెంబర్ 2017 వరకు పదవిలో కొనసాగారు. ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీకి (Rahul gandhi) అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.