Vijay Mallya asks FM to consider his offer to repay Kingfisher Airlines dues | (Photo Credits: IANS)

New Delhi, Mar 31: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus ) పంజా విసురుతున్న నేపథ్యంలో కింగ్ ఫిషర్ అధినేత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా (liquor baron Vijay Mallya) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ లాక్ డౌన్ (Coronavirus Lockdown) సంక్షోభ సమయంలోనైనా నా మొర ఆలకించాలని వరుస ట్వీట్లతో హోరెత్తించారు. వేలకోట్ల రుణాలను ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా అప్పులను తీరుస్తానని నా మొర ఆలకించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లించాలన్న తన కోరికను మన్నించాలంటూ, ఇక నైనా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని పదే పదే చెబుతూ వస్తున్నా బ్యాంకులు సిద్ధంగా లేవని అన్నారు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్ మెంట్లను విడుదల చేయడానికి ఈడీ కూడా సిద్ధంగా లేదంటూ వరుస ట్వీట్లలో వాపోయారు. కరోనా మహమ్మారితో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలోనైనా జోక్యం చేసుకోవాలని ఆర్ధిక మంత్రిని కోరారు.

Here's Vijay Mallya Tweets

 

 

దీంతో పాటుగా కోవిడ్ 19 వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను గౌరవిస్తున్నామని మాల్యా తెలిపారు. కింగ్ ఫిషర్ లో (Kingfisher Airlines) అన్ని కార్యకలాపాలను, తయారీని సమర్థవంతంగా నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా విజయ్ మాల్యా సూచించారు. తాను కూడా అదే చేస్తున్నానని ట్వీట్ చేశారు.