CPR to Snake Video: ఇదెలా సాధ్యం, చలనం లేని పాముకు సీపీఆర్ చేసి బతికించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊదడంతో కదలిక, వీడియో ఇదిగో...

మనుషులకే కాదు పాములకు కూడా సీపీఆర్ ద్వారా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నిరూపించాడు. పాము నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోతాయనుకున్న చాలా పాములను తాను కాపాడానని తెలిపారు. తాజాగా ఓ పాముకు ఆయన సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

CPR to Snake Video: ఇదెలా సాధ్యం, చలనం లేని పాముకు సీపీఆర్ చేసి బతికించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊదడంతో కదలిక, వీడియో ఇదిగో...
Police Giving CPR to Snake (photo-Video Grab)

మనుషులకే కాదు పాములకు కూడా సీపీఆర్ ద్వారా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నిరూపించాడు. పాము నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోతాయనుకున్న చాలా పాములను తాను కాపాడానని తెలిపారు. తాజాగా ఓ పాముకు ఆయన సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పురుగు మందు కలిపిన నీళ్లను తాగి చలనం లేకుండా పడి ఉన్న ఆ పాములో మళ్లీ కదలిక రావడం ఈ వీడియోలో కనిపించింది. అయితే, నిపుణులు మాత్రం సీపీఆర్ ద్వారా పాములు బతకవని, ఈ సంఘటనలో ఆ పాము తనకు తానుగానే మళ్లీ స్పృహలోకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం

ఘటన వివరాల్లో కెళితే.నర్మదాపురం పట్టణంలోని ఓ కాలనీలోకి పాము చొరబడింది. ఓ ఇంట్లోని పైప్ లైన్ లో చేరింది. దీనిని బయటకు వెళ్లగొట్టేందుకు ఆ ఇంటివాళ్లు విషం కలిపిన నీళ్లను పైపులోకి జారవిడిచారు. ఆ నీళ్లు తాగిన పాము కాసేపటికి బయటపడింది. అయితే, పాములో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డిపార్ట్ మెంట్ లో పాములను కాపాడే కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు.

Here's Video

ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి సీపీఆర్ చేశారు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. డిస్కవరీ ఛానెల్ చూస్తూ ఈ సీపీఆర్ పద్ధతి గురించి తెలుసుకున్నానని, గత పదిహేనేళ్లలో దాదాపు 500 లకు పైగా పాములను ఇలాగే కాపాడానని వివరించారు.

(The above story first appeared on LatestLY on Oct 26, 2023 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).