Kejriwal Dining: మా ఇంట్లో భోజనం చేస్తారా? అని కేజ్రీవాల్‌ని అడిగిన ఆటో డ్రైవర్.. ఇంటికెళ్లి భోజనం చేసిన ఢిల్లీ సీఎం... ఫోటోలు, వీడియో వైరల్
అహ్మదాబాద్ టూర్‌లో కేజ్రీవాల్.. ఆటో డ్రైవర్లతో సమావేశంలో కేజ్రీని తన ఇంటికి ఆహ్వానించిన విక్రమ్ దత్తా.. దత్తా ఆటోలోనే అతడి ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్.. ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగిన ఆప్ కన్వీనర్
Ahmedabad, September 13: గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... సోమవారం అహ్మదాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ విక్రమ్ దత్తా ఇంటికి వెళ్లి దత్తా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు ఆప్ ఈ విందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్లతో సమావేశానికి హాజరైన కేజ్రీవాల్‌ను విక్రమ్ దత్తా తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కేజ్రీవాల్... రాత్రి 8 గంటలకు మీ ఇంటికి వస్తానని దత్తాకు తెలిపారు.
Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn
— AAP (@AamAadmiParty) September 12, 2022
దత్తాకు చెప్పినట్లుగానే అతడి ఆటోలోనే అతడి ఇంటికి కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సందర్భంగా దత్తా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన కేజ్రీవాల్.. దత్తా కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చునే భోజనం చేశారు. అనంతరం దత్తా కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఫొటోలు దిగారు.
नेता नहीं, जनता का बेटा ❤️#KejriwalRukegaNahi pic.twitter.com/i0w3azQdqc
— AAP (@AamAadmiParty) September 12, 2022
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

