EAM S Jaishankar (Photo Credit- ANI)

New Delhi, Dec 19: కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్ర స్థాయిలో (Jaishankar hits out at Rahul Gandhi) మండిపడ్డారు. భారత జవాన్లకు పిటై (Pitai Word) అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై (Jaishankar Slams Rahul Gandhi) విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారని, అలాంటి వారిని మనం గౌరవించాలని తెలిపారు. వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని జైశంకర్‌ లోక్‌సభలో అన్నారు.

ఢిల్లీలో మళ్లీ రోడ్డెక్కిన రైతులు, తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్, మొత్తం నాలుగు డిమాండ్లతో రైతులు ర్యాలీ

ఈ మేరకు విదేశాంగమంత్రి జై శంకర్‌ (EAM S Jaishankar) సోమవారం లోక్‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే...భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరు పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ప్రధాని మోదీతో సమావేశానికి ముందు కరోనాకు గురైన హిమాచల్ సీఎం సుఖు, కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు రీషెడ్యూల్

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్‌ చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్‌ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.