Hyderabad,November 29: దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల(Womens)కు రక్షణ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్నిజాగ్రత్తలు సూచిసున్నప్పటికీ వాటిని ఎవరూ ఫాలో కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో పెను విషాదాన్ని నింపిన మహిళ సజీవ దహన ఘటనలతో స్త్రీలు ఇప్పటికైనా మేలుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేప్టీ ఫీచర్లను వినియోగించుకోవాలని అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే కొన్ని యాప్ (Apps) లు ,లేదా ఎమర్జెన్సీ నంబర్ల (Emergency Helpline Numbers) ద్వారా సమాచారం ఇవ్వండి. ఆపద ఏదైనా ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పోలీసులు అభయమిస్తున్నారు.
ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100 (Dial 100)కు ఫోన్‌చేస్తే దగ్గర్లోని పోలీసులకు సమాచారం వెళ్లే వ్యవస్థ అందుబాటులో ఉన్నది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఇటీవల ప్రారంభించిన 112 (Dial 112) ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అన్నిరకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణ పోలీసులు (Telangana Police Department) వినియోగిస్తున్న టెక్నాలజీతో ఫిర్యా దు అందిన తర్వాత ఘటనాస్థలానికి చేరుకునే రెస్పాన్స్ సమయం హైదరాబాద్ పరిధి (Hyderabad)లో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఉంటున్నది. ఇందుకోసం పోలీసులు హాక్–ఐ (HawkEye) లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100ను సంప్రదించాలని కోరుతున్నారు. ఈ యాప్‌ను లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు.
యూజర్లు ముందుగా ‘హాక్–ఐ’(Hawk-Eye)లో ఉన్న ఎస్‌ఓఎస్‌లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్‌ఓఎస్’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా నేరుగా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది.
వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది.
వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది.
నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు.
సమాచారం పంపే సమయం కూడా లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌వోఎస్ బటన్ ఉం టుంది. ఇది నొక్కితే పోలీసులతోపాటు ముందుగా ఇందులో నమోదుచేసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితుల (ఐదుగురి) నంబర్లకు మీరు ఆపదలో ఉన్నట్టు సమాచారం వెళ్తుంది. మీరు ఉన్న ప్రదేశం లొకేషన్ వివరాలు వెళ్తాయి. అక్క డ పెట్రోలింగ్‌లో ఉన్న పెట్రోకార్లకు, మెయిన్ కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తి వద్దకు త్వరగా వెళ్లేందుకు పోలీసులు అన్నిచర్యలు తీసుకుంటారు. మీ మొబైల్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచితే ఎస్‌వోఎస్ బటన్ సేవలు మరింత సులభమవుతాయి.
తెలంగాణ పోలీసులు క్యాబ్‌లను పోలీస్ పెట్రోకార్లకు అనుసంధానిస్తూ ఎమర్జెన్సీ సదుపాయా న్ని కల్పించారు. క్యాబ్‌లో వెళ్లేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే క్యాబ్ బుక్‌చేసుకున్న మొబైల్‌యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కితే పోలీసులకు సమాచారం వెళ్తుంది. క్షణాల్లో ఈ సమాచారం పోలీస్ కంట్రోల్ రూంతోపాటు సమీపంలోని పెట్రో మొబైల్ వాహనానికి, హాక్‌ఐలో నమోదుచేసుకున్న నంబర్లకు చేరుతుంది. వెంట నే ఆదుకొనే అవకాశం ఉంటుంది.
ఈ యాప్‌తోపాటు డయల్ ‘100’, వాట్సప్ (హైదరాబాద్: 9490616555, సైబరా బాద్: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు.