Abhishek Banerjee. Credits: Facebook

New Delhi, April 21: స్వలింగ వివాహాలపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. స్వలింగ వివాహాలకు తన మద్దతు ప్రకటించారు.స్వలింగ వివాహాలపై అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ విషయంపై తాను కామెంట్ చేయబోనంటూనే.. ప్రేమకు కులం, మతం, సరిహద్దులు లేవన్నారు.

స్వ‌లింగ సంప‌ర్కుల మ్యారేజ్‌, జననాంగాలకు సంబంధం లేదని తెలిపిన సుప్రీంకోర్టు, గే పెళ్లిళ్ల పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

తాను పురుషుడినైతే పురుషుడిని, మహిళనైతే మహిళపై ఇష్టం పెంచుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రేమలో పడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి హక్కు వారికి ఉంటుందని టీఎంసీ నేత స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి కారణం లేకుండా కావాలనే జాప్యం చేస్తోందని మండిపడ్డారు.

పెళ్లి చేసుకోవాలంటే మగ, ఆడ అవసరమా, శారీరక సంబంధం కోసమే పెళ్లి చేసుకుంటారా, న్యాయవాదులను ప్రశ్నించిన సీజేఐ డివై చంద్రచూడ్

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు.. స్వలింగ వివాహాలు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమని చెప్పేందుకు కేంద్రం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. స్వలింగ వివాహాలపై విచారణ 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Here's ANI Video

సుప్రీంకోర్టుకు వచ్చే వ్యాజ్యాలు అధికంగా ఉండడంతో జడ్జీలపై పని భారం పెరిగిపోతోందని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. ఒక్కో ధర్మాసనానికి అయిదుగురు జడ్జీల చొప్పున కేటాయించుకుంటూ పోతే మిగతా వ్యాజ్యాల విచారణపై దాని ప్రభావం పడుతుందని వివరించారు. కాబట్టి సమయ పాలన పాటిస్తూ వాదనలు త్వరగా ముగించేలా చూడాలని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతున్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు.