Prayagraj, OCT 21: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రయాగ్‌రాజ్ (Prayagraj) ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. డెంగీతో (dengue) బాధపడుతున్న ఓ రోగికి బ్లడ్ ప్లాస్మాకు (Plasma) బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. దీంతో రోగి ప్రాణాలు (dengue patient died) కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే డెంగీ రోగి (dengue patient died) చనిపోయాడని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వేదాంక్ సింగ్ (vedank singh) అనే నెటిజన్ ట్వీట్ చేసి, వైరల్ చేశారు. ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించడంతో రోగి ప్రదీప్ పాండే చనిపోయాడని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీడియోలో కూడా ప్లేట్‌లెట్స్‌కు (platlets) బదులుగా ఆ ప్యాకెట్‌లో మోంసబి జ్యూస్ (mosambi juice) కనిపించింది.
प्रयागराज में मानवता शर्मसार हो गयी।
एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया।
मरीज की मौत हो गयी है।
इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP
— Vedank Singh (@VedankSingh) October 19, 2022
డెంగీ రోగి చనిపోయిన ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్ (Brijesh patak) స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
UP | We've formed a team with CMO & sent to the spot. Report to be submitted within a few hours. Strict action will be taken: Dy CM Brajesh Pathak on fake plasma being supplied to a dengue patient in UP https://t.co/D7IAkMy1dw pic.twitter.com/fbp3aSh3Wm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 20, 2022
ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ విచారణ జరుపుతుందన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు.