Farmers Delhi chalo Resumes: మ‌రోసారి దేశ‌రాజ‌ధాని వైపు క‌దులుతున్న రైతులు, చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో ఢిల్లీ చలో నిర‌స‌న మార్చ్ తిరిగి ప్రారంభం
Farmers' 'Delhi Chalo' March (photo-ANI)

New Delhi, March 06: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్‌ ఢిల్లీ ఛలో (Delhi chalo) బుధవారం ఉదయం మళ్లీ మొదలు కానుంది. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్‌, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను (Farmers Protest) ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్‌ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను (Farmers Protest) బుధవారం నుంచి పునరుద్ధరించనున్నారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్‌ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు.

 

ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి.