ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశునికి పూజ చేస్తున్నట్లు మట్టితో తయారుచేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, ఆలోపించేసేలా ఉన్నది. హ్యాపీ గణేశ్ పూజ అని సందేశమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Happy #GaneshChaturthi .My SandArt of Lord Ganesh by using 3,425 sand ladoos and Some Flowers at Puri beach in Odisha . pic.twitter.com/ruIOUDzaEj
— Sudarsan Pattnaik (@sudarsansand) August 31, 2022