Ruckus at Goa Airport (Photo-Video Grab)

గోవా నుంచి ముంబై వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం రద్దు కావడంతో గోవా విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2.10 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా సరిగ్గా పది నిమిషాల ముందు విమానం రద్దయినట్టు ప్రయాణికులకు అధికారులు సమాచారం అందించారు. దీంతో అప్పటి వరకు విమానం కోసం వేచి చూసిన ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

యువకుడి ప్రైవేట్ పార్ట్ పట్టుకుని లాగేసిన పిట్‌బుల్ డాగ్, నొప్పితో విలవిలలాడిన బాధితుడు, పరిస్థితి విషమం

విమాన సిబ్బందితో వారు గొడవకు దిగారు. విమానాన్ని రద్దు చేసినట్టు 10 నిమిషాల ముందు చెప్పడం ఏంటని నిలదీశారు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం రద్దు కావడంతో 80 మందికిపైగా ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

Here's Video

అధికారులతో ప్రయాణికులు వాదులాడుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. ‘ఆయన తల పగలగొట్టండి’ అని గో ఫస్ట్ సిబ్బందిని ఉద్దేశించి ఓ ప్రయాణికుడు అరవడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ గొడవ తర్వాత ఉదయం 6.30 గంటల సమయంలో మరో విమానం ద్వారా ప్రయాణికులను గమ్య స్థానానికి తరలించారు.