New Delhi, FEB 02: అదానీ ఎంటర్ ప్రైజెస్ ( Adani Enterprises Ltd) కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ గౌతమ్ అదానీ (Goutham adani) ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఎఫ్ పీవోపై నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లకు బోర్డు తరపున ధన్యావాదాలు తెలిపారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సబ్ స్క్రిప్షన్ గడువు మంగళవారంతో ముగిసింది. కానీ గత వారం రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి ఇన్వెస్ట్ మెంట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ముందుకు వెళ్లడం సరికాదని భావించి బోర్డు ఇన్వెస్టర్ల పెట్టుబడిని తిరిగి చెల్లించడానికి మొగ్గు చూపిందన్నారు. ఎఫ్ పీవోని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ ( Adani Enterprises Ltd) ప్రకటన చేసింది.
#WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would've surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn't be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group
(Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA
— ANI (@ANI) February 2, 2023
దీంతోపాటు పెట్టుబడిదారులకు వారు పెట్టుబడి పెట్టిన నగదును తిరిగి ఇవ్వనున్నారు. 20 వేల కోట్ల విలువైన ఎఫ్ పీవోలను ఉపసంహరించుకుంటున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తన ప్రకటనలో తెలిపింది.
త్వరలో పెట్టుబడిదారులకు వారి డబ్బు తిరిగి వస్తుంది. బోర్డు ఆఫ్ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ పూపూర్తిగా సబ్ స్క్రైబ్ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ను (FPO) వెనక్కి తీసుకుంది. అమెరికన్ షాట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ ఎంటర్ ప్రైజెస్ ట్యాక్స్ సర్వెంట్స్ ను ఉపయోగిస్తుందని ఆరోపిండచంతో వివాదాలు చెల రేగాయి. దీంతో కంపెనీ తన ఎఫ్ పీవోను రద్దు చేసినట్లు తెలిపింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా 20 వేల కోట్ల రూపాయల వరకు ముందుకు వెళ్లకూడదని నిర్ణయించింది. నిజానికి స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఇప్పుడు రద్దు చేసిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సూపర్ హిట్ అయింది. ఇష్యూ మూడో రోజు పూర్తిగా సబ్ స్క్రైబ్ అయింది. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి విపరీతంగా మద్దతు లభించింది.
మంగళవారం సాయంత్రం 3:45 గంటలకు అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోకు 5 కోట్ల 1లక్ష 12 వేల 652 షేర్లకు బిడ్లు వచ్చాయి. కంపెనీ ఇష్యూ చేస్తున్న 4 కోట్ల 55 లక్షల 6 వేల 791 షేర్ల కన్నా 11 శాతం అధికంగా బిడ్లు వచ్చాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్ పీవోపై ఎక్కువగా ఆసక్తి కనబర్చలేదు. వారికి కేటాయించిన షేర్లకు కేవలం 11 శాతమే బిడ్లు వచ్చాయి. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.26 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషన్ల విభాగం 126 శాతం సబ్ స్క్రైబ్ అయింది. అమెరికా షాట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆవిరి అవుతున్నప్పటికీ అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ ఇందులో పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.