P Chidambaram, INX Media Case. (Photo Credits: IANS)

Jaipur, May 14: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో (Udaipur) మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో (Chintan Shivir) ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థపై ప్యానెల్‌కు చిదంబరం (Chidambaram) సారథ్యంవహిస్తున్నారు. ఉదయపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలో ఉన్న‌ తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. దేశ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉందని, వృద్ధి రేటు రోజురోజుకూ ప‌డిపోతోంద‌ని ఆందోళన వ్యక్తంచేశారు. ద్ర‌వ్యోల్బ‌ణం (Inflation) ఎన్న‌డూ ఊహించ‌ని స్థాయికి చేరుకుంద‌ని ఇది ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి.

ఈ క్రమంలో చిదంబరం తగ్గుతున్న వృద్ధి రేటు..పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూల్ గా ఉందని విమర్శించారు. పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ప‌న్నులు కూడా ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌కు కార‌ణాల‌ని ఆయ‌న ఆరోపించారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జార‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోన్న‌ విదేశీ వ్య‌వ‌హారాల తీరు కూడా ఓ కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఊహించ‌ని స్థాయికి ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోతున్న‌ప్ప‌టికీ దాన్ని కేంద్ర ప్రభుత్వం క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతోంద‌ని చిదంబరం విమర్శించారు.

Rat Problem In New York: న్యూయార్క్ నగరాన్ని పట్టి పీడిస్తున్న ఎలుకల సమస్య, విపరీతంగా పెరిగిపోయిన ఎలుకల జనాభా, న్యూయార్క్ జనాభా కన్నా 5 రెట్లు పెరిగిన ఎలుకల జనాభా.. 

దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రపంచ, దేశీయ తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత దేశ ఆర్థిక విధానాలను రీసెట్ చేయాల్సిన అవసరముందని కేంద్రానికి సూచించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పాలనలో గత ఎనిమిదేళ్లుగా దేశ వృద్ధి రేటు ఏడాదికి ఏడాది మందగించిందని విమర్శించారు. కరోనా సంక్షోభం తర్వాత కూడా వృద్ధి రేటు కోలుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. దిగజారుతున్న ఈ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్ట జీఎస్‌టీ చట్టాల గురించి అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేని విధంగా బలహీనంగా ఉన్నాయని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు అవసరమని చిదంబరం సూచించారు. 1991లో పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకరణతో కొత్త శకానికి నాంది పలికిందని ఈ సందర్భంగా చిదంబరం గుర్తుచేశారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, కొత్త పారిశ్రామికవేత్తలు, భారీ మధ్యతరగతి, లక్షలాది ఉద్యోగాలు, ఎగుమతులతో దేశం అపారమైన ప్రయోజనాలను పొందిందని గుర్తుచేశారు. కేవలం పదేళ్ల కాలంలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అయితే గత ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నా.. కట్టడి చేయలేని అసమర్థ స్థితిలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Tripura New CM: ఇంకో ఏడాదిలో ఎన్నికలుండగా సీఎం మార్పు, త్రిపురలో వ్యూహం మార్చుతున్న బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి సీఎం పదవి అప్పగింత, పాత సీఎంపై వ్యతిరేకతే కారణమనే వాదన 

30 సంవత్సరాల తర్వాత.. ప్రపంచ, దేశీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక విధానాలను రీసెట్ చేయడంపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆర్థిక విధానాల రీసెట్ అనేది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, దిగువ 10 శాతం జనాభాలోని అత్యంత పేదరికం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ (116 దేశాలలో 101), మహిళలు పిల్లల్లో విస్తృతమైన పోషకాహార లోపం తదితర సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్రానికి దార్శనికత లోపించిందని ఎద్దేవా చేశారు.