File photo a rat on a subway platform in New York City. ( Image Source : Getty )

న్యూయార్క్ నగరంలో గడిచిన దశాబ్ద కాలంతో పోల్చితే ఈ సంవత్సరం ఎలుకల జనాభా భారీగా పెరిగింది. న్యూయార్క్ లో ఎలుకల జనాభా ఎంత పెరిగిందో ప్రస్తుతానికి చెప్పలేమని, అయితే కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో జనసంచారం రోడ్లపై, ఆఫీసుల్లో తగ్గడంతో, ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా పెరిగిందని న్యూయార్క్ స్టేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.

అంతేకాదు ఎలుకల వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మూత్రపిండాలు, కాలేయాన్ని ప్రభావితం చేసే లెప్టోస్పిరోసిస్ కారణంగా కనీసం 13 మంది ఆసుపత్రి పాలయ్యారు - వారిలో ఒకరు మరణించారు - గత సంవత్సరం పలు ఆసుపత్రులకు వచ్చిన కేసుల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఎలుకలతో సంబంధం కలిగి ఉంటడటం గమనార్హం.

ఒక నివేదిక ప్రకారం, న్యూయార్క్ నగరంలో కరోనా తర్వాత ఎలుకల సమస్య పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎలుకలు ఖాళీగా ఉన్న ఆఫీసులు, అలాగే గోడౌన్లను తమ స్థావరాలుగా మార్చుకున్నాయని, అవి ఆహారం కోసం తమ బొరియల నుండి బయటికి వచ్చినప్పుడల్లా వ్యాధులు వ్యాపిస్తున్నాయని పేర్కొంది.

ఎలుకలు జీవించడానికి ప్రతిరోజూ ఒక ఔన్సు కంటే తక్కువ ఆహారం అవసరమని, ఆహారం కోసం అవి సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించవని నివేదిక పేర్కొంది.

న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన పెస్ట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ కార్నెల్ యూనివర్శిటీకి చెందిన మాట్ ఫ్రై, మాట్లాడుతూ, ఎలుకలను ఆరుబయట రావడం అనేది వాటికి ఎంత ఆహారం అందుబాటులో ఉంది, ఎక్కడ ఉంది" అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎలుకల సమస్య "నేరుగా మానవ ప్రవర్తనతో ముడిపడి ఉన్నాయి" అని ఆయన అన్నారు. స్ట్రీట్ ఫుడ్, ఔట్‌డోర్ డైనింగ్‌తో రోడ్లపై వాటికి మిగులు ఆహారం లభ్యం కావడంతో, ఎలుకల జనాభా మరింత పెరిగిందని, తెలిపారు. రెస్టారెంట్ టేబుల్‌ల వద్ద మిగిలిపోయిన అసంపూర్తి భోజనం కొన్నిసార్లు ఎలుకలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

సమస్య శతాబ్దాల నాటిది

ఎలుకలు ఉత్తర అమెరికాకు చెందినవి కావు, అలాగని ఎలుకల సమస్య న్యూయార్క్ నగరానికి కొత్త కాదు. 1860లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎలుకల సమస్యను డాక్యుమెంట్ చేస్తూ, మాన్‌హట్టన్‌లోని బెల్లేవ్ హాస్పిటల్‌లో ఎలుకలు కరిచి ఒక పిల్లవాడు ఎలా మరణించాడనే వార్తను ప్రచురించింది.

1700 సంవత్సరం నుంచి న్యూయార్క్ లో ఎలుకలు ఉన్నాయి. ది గార్డియన్‌లోని 2021 నివేదిక ప్రకారం, నార్వేకు చెందిన ఎలుక జాతి - రాటస్ నార్వెజికస్ - నగరంలోని ఎలుక జనాభాలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ బ్రౌన్ ఎలుక నార్వేజియన్ షిప్‌లతో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించేటప్పుడు దాని మూలాలను విస్తరించింది. కొలంబియా యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, నార్వే ఎలుకలు 1776లో అమెరికాకు చేరుకున్నాయి, "అమెరికన్ వలసవాదులతో పోరాడటానికి బ్రిటన్ నియమించిన హెస్సియన్ దళాలు (జర్మన్ సైనికులు) ధాన్యం పెట్టెల ద్వారా ఇవి ఇక్కడకు వచ్చాయి.

టాక్సిక్ సూప్ ట్రాప్, మెరుగైన వ్యర్థాల నిర్వహణ నుండి 32 మిలియన్ డాలర్ల ప్రణాళిక, డ్రై ఐస్ ట్రీట్‌మెంట్ వరకు, ఎలుక సమస్యను అంతం చేయడానికి నగరం అనేక ప్రయత్నాలను చూసింది.

ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇటీవల తాజా చర్యను ప్రకటించారు. ఎలుకలు సాధారణంగా విందు చేసే చెత్త సంచుల పెద్ద కుప్పలను తగ్గించడానికి ప్యాడ్‌లాక్డ్ చెత్త డబ్బాలను రోడ్ల పక్కన ఉంచబోతున్నట్లు తెలిపారు.