Image used for representational purpose | (Photo Credits: PTI)

Bengaluru, August 20: కర్ణాటకలో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో పారిపోయిందనే కోపంతో (poisons children after wife elopes with lover) మనస్తాపం చెందిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని తుమకూర్‌ జిల్లా, పీహెచ్‌ కాలనీలో గురువారం వెలుగు చూసింది. మృతుడిని (man kills self) సమీయుల్లాగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సమీయుల్లాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల కింద భార్య సహీరా బాను.. ప్రియుడితో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ.. ప్రియుడితో ఎంజాయ్‌ చేస్తోంది. భర్తకు అప్పుడప్పుడు వీడియో కాల్స్​ చేస్తూ వారు తిరిగే ప్రదేశాలను చూపించేది. ఈ క్రమంలో ఇంటికి రమ్మని భర్త ఎంత బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయుల్లా.. తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి అనంతరం తానూ విషం తాగాడు.

తాగొస్తున్నాడని అరచినందుకు ఇంటి యజమానిని సుత్తితో కొట్టి చంపేశాడు, అనంతరం సెల్ఫీ తీసుకుని పరార్, ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి

ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బెంగళూరు పోలీసులు తెలిపారు.