
Delhi, August 20: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమానిని సుత్తితో కొట్టి దారుణంగా చంపడమే కాకుండా అతనితో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు అదెకున్న వ్యక్తి. చివరకు కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్‌కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా (Told Not To Drink) చివాట్లు పెట్టాడు. ఆ తర్వాత పంకజ్ ఇంటి యజమాని సురేష్ కి, అతని కొడుకు జగదీష్‌లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్.. ఇంటి యజమాని సురేష్ తనను చాలా ఘోరంగా తిట్టడాన్ని సహించలేక, తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఐతే జగదీష్‌కి పంకజ్ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్ ఇంటికి వచ్చి చూశాడు. అంతే అక్కడ తండ్రి మృతి (Tenant Hammers Delhi Man To Death) చెంది ఉండటం గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
విచారణలో సురేష్‌ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్ వెళ్లిపోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్‌కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్‌లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది.