Monkeypox in India (Photo-ANI)

భారత్ లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్‌ వ్యక్తికి మంకీపాక్స్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా తొమ్మదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్‌ వ్యక్తి నుంచి శాంపిల్స్‌ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్‌ఎన్‌జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.