FSSAI (File Image)

పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’ (Dahi) గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే దీనిపై హిందీయేతర అభిమానులు మండిపడ్డారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ‘కర్డ్’ అన్న ఇంగ్లీషు పదాన్ని వాడొచ్చు, అలాగే ప్రాంతీయ భాషా పదాన్ని వాడొచ్చని తెలుపుతూ ప్రావిజన్స్‌ను జారీ చేసింది. ఇదివరలో ‘కర్డ్’ అన్న పదం వాడొద్దని, ‘దహీ’ అన్న హిందీ పదమే వాడాలని జారీచేసిన ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. దీంతో హిందీ దురభిమానులు ఒక మెట్టు దిగొచ్చారని తెలుస్తోంది.

Here's ANI Tweet