New Delhi, Febuary 9: రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పును వెల్లడించింది. రిజర్వేషన్ (Reservations) కల్పన అన్నది ప్రాధమిక హక్కేమీ కాదు. నియామకాలు, పదోన్నతుల్లో మనహాయింపులు ఇవ్వాలా? వద్దా? అన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పదవుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రభుత్వానికి తప్పనిసరేమీకాదు.
కొన్ని జాబ్స్, పోస్టుల్లో ఎస్‌సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయా రాష్ట్రాలను (state government) కోర్టులు ఆదేశించలేవని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఏ ఒక్కరికీ వ్యక్తిగతంగా రిజర్వేషన్ కోరడం ప్రాధమిక హక్కు కాదని తేల్చేసింది. ఎవరికి మినహాయింపులు ఇవ్వాలో అనేది ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం క్లారిటీ ఇచ్చింది.
ఆర్టికల్ 370 రద్దుపై విచారణ కోసం 'ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం'
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాల పరిమితికి ( Scheduled Tribes) రాష్ట్రాలు కట్టుబడి ఉండవని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కుకాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలుచేయాలనడం ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని తేల్చిచెప్పింది. అంతేకాదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మండమస్ జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ బంద్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పన రాష్ట్రాల ఇష్టం. వాటికి కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేం. అయితే ఆయా వర్గాలకు ఉద్యోగాల్లో దామాషా ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రభుత్వం గణాంకాలను సేకరించుకోవచ్చు. అంతేతప్ప.. కోటాను తప్పనిసరిగా అమలు చేయాలని రూలేం లేదు..’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి మాత్రం నోటీసులు జారీ
కోటాను ప్రాథమిక హక్కుగా ఏ వ్యక్తీ డిమాండ్ చేయడం కుదరని పేర్కొంది.ఆర్టికల్ 16లోని నిబంధనలు రాష్ట్రప్రభుత్వంల విచక్షణకు లోబడి ఉంటాయంది. ఉత్తరాఖండ్ పీడబ్ల్యూ శాఖలోని అసిస్టెంట్ ఇంజినీర్ పదోన్నతుల కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పదోన్నతుల్లో కోటా ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా హైకోర్టు ఒప్పుకోలేదు. రాష్ట్రానిదే తుది నిర్ణయం అంటూ సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది.
ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్
ఎస్‌సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా (Scheduled Castes) అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలు చేపట్టాలన్న 2012 నాటి ఉత్తరాఖండ్ ప్రభుత్వ (Uttarakhand GOVT) నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చుకొనే హక్కు రాష్ట్రాలకు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించలేదని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నోటిఫికేషన్లను నిలుపుదలచేస్తూ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది.