New Delhi, Dec 29: కరోనా కొత్త వేరియెంట్ భారత్ లో కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు (RT-PCR Must for Flyers) తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.
చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి ఆరు దేశాల నుంచి వచ్చే వారు (China and five other countries) ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్‌లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది.
రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. జనవరి మధ్యలో కరోనా కేసులు భారత్ లో విపరీతంగా పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మ