Teachers Fight Video: విద్యార్థుల ముందే తన్నుకున్న ఉపాధ్యాయులు, ఏడుగురికి గాయాలు, వైరల్ వీడియో ఇదిగో..

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు తరగతి గదిలో విద్యార్థుల ముందే దారుణంగా కొట్టుకున్నారు. ఉత్త‌ర కేర‌ళ జిల్లాలోని ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ సంఘటనలో ఏడుమంది టీచర్లు గాయపడ్డారు. క్లాస్ రూంలోనే టీచర్లు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Teachers Fight Video: విద్యార్థుల ముందే తన్నుకున్న ఉపాధ్యాయులు, ఏడుగురికి గాయాలు, వైరల్ వీడియో ఇదిగో..
Kerala Teacher Fight Video (photo-Video Grab)

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు తరగతి గదిలో విద్యార్థుల ముందే దారుణంగా కొట్టుకున్నారు. ఉత్త‌ర కేర‌ళ జిల్లాలోని ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ సంఘటనలో  ఏడుమంది టీచర్లు గాయపడ్డారు. క్లాస్ రూంలోనే టీచర్లు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ ఘ‌ట‌న గ‌త వార‌మే జ‌రిగినా.. ఆ దాడికి చెందిన వీడియో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. స్కూల్‌లో జ‌రుగుతున్న మీటింగ్‌కు మ‌రో స్కూల్‌కు చెందిన టీచ‌ర్ వ‌చ్చి గొడవ సృష్టించాడు. గొడవ పడిన అతని భార్య ఈ స్కూలులో టీచర్ గా పనిచేస్తోంది.  భార్య‌ను పిక‌ప్ చేసుకునేందుకు స్కూల్‌కు వ‌చ్చిన అత‌ను.. ఆ మీటింగ్‌లో ఉన్న టీచ‌ర్ల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. దీంతో టీచ‌ర్ల మ‌ధ్య గొడ‌వ మొద‌లై ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు విసురుకునే స్థాయికి చేరుకుంది.  టీచ‌ర్ షాజీని బుధ‌వారం అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేశారు. స్థానిక కోర్టు ముందు అత‌న్ని హాజ‌రుప‌రిచారు.

Kerala Teacher Fight Video (photo-Video Grab)

Here's Video

 

(The above story first appeared on LatestLY on Nov 16, 2023 02:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).