Special Rs 75 coin (PIC@ ANI)

New Delhi, May 27: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం (Parliament) రోజున కేంద్రం రూ.75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాణేన్ని పొందాలంటే ఎలా? ఈ నెల 28 న ప్రధాని మోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని (commemorate new Parliament building) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రూ.75 ల నాణేన్ని (Special Rs 75 coin) విడుదల చేస్తోంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక నాణాలు రూపొందించారు. అయితే ఈసారి విడుదల చేయబోతున్న నాణేనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  ఈసారి విడుదల చేస్తున్న రూ. 75 నాణెంపై (Special Rs 75 coin) పార్లమెంట్ నూతన భవనం చిత్రం ఉంది.

Sengol Handover to PM Modi: ప్రధాని మోదీ చేతికి రాజదండం, ప్రధాని నివాసాకి వచ్చి అందజేసిన 20 మంది పీఠాధిపతులు కొత్త పార్లమెంట్ భవనం కోసం సర్వం సిద్ధం 

దానికి పై భాగాన ‘సన్ సద్ సానుకూల్’ అని దేవనాగరి లిపిలో .. కింద ‘పార్లమెంట్ కాంప్లెట్స్’ అని ఇంగ్లీషులో ముద్రించారు. 44 మిల్లీ మీటర్ల వ్యాసంలో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేనికి చివర 200 వంకీలు ఉన్నాయి. 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపిన మిశ్రమంతో తయారు చేసారట.

New Parliament Building First Look: కొత్త పార్లమెంట్‌ ఫస్ట్ లుక్ వీడియో ఇదిగో, మూడు ప్రధాన ద్వారాలతో సంసద్ భవన్, లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు 

పార్లమెంట్ కాంప్లెక్స్ కింద భాగంలో 2023 అని రాసి ఉంది. నాణేనికి రెండో వైపు భారత్ అని దేవనాగరి లిపిలోనూ, ఇంగ్లీష్‌లో ఇండియా అని రాసి ఉంటుంది. అయితే ఈ నాణేలు చలామణి కోసం ప్రారంభిస్తున్నవి కాదు. కేవలం వీటిని సేకరించడానికి మాత్రమే వినియోగిస్తారు. ఇవి ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలోని ముద్రణాలయాల్లో రూపొందిస్తారు. వీటి తయారు ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో తక్కువ సంఖ్యలో ముద్రిస్తారు. అయితే వీటిని కొనాలంటే నేరుగా ముద్రించే ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. కొన్ని ఏజెన్సీల ద్వారా వీటిని కొనవచ్చు. లేదంటే kolkata Mint, Mumbai Mint, Hyderabad Mint అధికారిక వెబ్ సైట్లలో కొనుగోలు చేసుకోవచ్చును. అయితే ఎక్కువగా వీటిని నాణేలు సేకరించేవారు మాత్రమే కొంటూ ఉంటారు.