New Parliament Building

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం ఫస్ట్‌ లుక్‌ వీడియో విడుదల అయింది. ఈ వీడియోలో పార్లమెంట్‌ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్‌ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.

కొత్త పార్లమెంట్ భవనం లోపలి వీడియో ఇదిగో, ఎగువ సభ ఎరుపు రంగులో, దిగువ సభ ఆకుపచ్చ రంగులో..

పార్లమెంట్‌ లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు ఉన్నాయి. కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్. స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు.

Here's Video

ఇక పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియెట్‌, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. అయితే.. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ఉల్లంఘన(పార్లమెంటు రాజ్యాంగాన్ని వివరించేక్రమంలో.. ఉభయ సభలకు రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారని వివరిస్తుంది) కిందకు ఎలా వస్తుందని, ఒక న్యాయవాదిగా అది రుజువు చేయాలని జస్టిస్‌ జేకే మహేశ్వరి కోరారు.