CJI NV Ramana (Photo-PTI)

New Delhi, August 26: సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) నేడు పదవీ విమరణ చేయనున్నారు. సుప్రింకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజు నూతనంగా నియమితులైన సీజేఐలతో కలిసి రమణ బెంచ్ ను పంచుకోనున్నారు. మొత్తం ఐదు కేసులకు సంబంధించి (5 Verdicts On His Last Day) సుప్రింకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలను తొలిసారిగా సుప్రింకోర్టు (Supreme Court) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

శుక్రవారం రోజు విచారణకు రానున్న, తీర్పు వెలువరించనున్న కేసులకు సంబంధించిన జాబితాను సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. గురువారం రాత్రి దాదాపు 11.30 దాటాక విడుదల చేసిన ఈ జాబితాలో సీజేఐ‌గా జస్టిస్‌ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను వెలువరించనున్నట్లు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పేర్కొంది. శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఐదు కేసుల్లో తీర్పు వెలువరించనున్నట్లు తెలిసింది.

ఐదు కీలక తీర్పులకు సంబంధించిన వివరాలు ఇవే..

1. ఎన్నికల్లో ఉచితాలపై తీర్పు

2. 2007 ఘోరక్‌పూర్ అల్లరపై యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు

3. కర్ణాటక మైనింగ్ కేసు‌లో తీర్పు

4. రాజస్థాన్ మైనింగ్ లీజ్ అంశంపై తీర్పు

5. National Company Law Appellate Tribunal వెలువరించిన తీర్పుపై ABG Shipyard సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు

జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సుప్రింకోర్టు 48వ సీజేఐగా రమణ సేవలు అందించారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. న్యాయవాది నుంచి మొదలు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సిజేఐ గా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, జడ్జీల నియామకంపై ఎన్వీ రమణ ప్రధానంగా దృష్టిసారించారు. ఈయన హయాంలో 224 మంది హై కోర్టు న్యాయమూర్తుల నియామకం జరగడం గమనార్హం.

వీడియో ఇదే, ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భారత సైన్యం, అక్రమంగా భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం

జస్టిస్ ఎన్వీ రమణ నేడు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేయనుండగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. యూయూ లలిత్ పేరును తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది