Credit @ ANI Twitter

Bagaha, OCT 08: బీహార్‌లో గ్రామస్థులను ముప్పుతిప్పలు పెడుతున్న పులిని (Tiger) అటవీశాఖ సిబ్బంది మట్టుబెట్టారు. ఈ మ్యాన్ ఈటర్ టైగర్ ను చంపేందుకు ఆపరేషన్‌ బాగ్‌ను (Operation Bagah) చేపట్టారు. బగాహా ప్రాంతంలోని చెరుకు తోటలోకి పారిపోయి దాక్కున్న పులిని (Man eater Tiger) మట్టుబెట్టేందుకు 10 మంది షూటర్లు (Shooters) రంగంలోకి దిగారు. తోటలో ఉచ్చును బిగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పులి పంజాకు చిక్కి ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లీకుమారుడ్ని ఈ పులి పొట్టపెట్టుకున్నది. గేదెలకు గడ్డి కోసి తీసుకెళ్లేందుకు తల్లి తన 10 ఏండ్ల కుమారుడితో అడవి వైపు రాగా పులి దాడి చేసి ఇద్దర్నీ హతమార్చింది. కాగా, గత మూడు రోజులుగా నలుగురిని చంపింది. గ్రామస్థులు అరవడంతో గోవర్ధనగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలువా గ్రామ శివారులోని చెరుకు తోటలోకి పారిపోయి అక్కడే తిష్టవేసింది.

ఈ చెరుకు తోటను స్థానిక అటవీ అదికారులు, పోలీసుల బృందం చుట్టుముట్టింది.  వాల్మీకినగర్‌ టైగర్‌ రిజర్వ్‌ (VTR) నుంచి జనంలోకి పులిని పట్టుకునేందుకు 8 మంది షార్ప్‌ షూటర్లు, నలుగురు శిక్షణ పొందిన సైనికులు రంగంలోకి దిగారు. పట్నాకు చెందిన నలుగురు ఎస్‌టీఎఫ్‌ షూటర్లు (STF Shooters) కూడా మాటు వేశారు.

Selfie With Tiger: పులితో సెల్ఫీ దిగేందుకు యువకులు పరుగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రమాదకర చర్యపై మండిపడుతున్న నెటిజన్లు  

దాదాపు 200 మంది అటవీ సిబ్బంది పొలం చుట్టూ మొహరించారు. గ్రామస్థులు ఎవరూ అటు వైపు రాకుండా నిరోధించేందుకు దాదాపు 80 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇళ్ల నుంచి గ్రామస్థులు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి సాగిన ఆపరేషన్ దాదాపు 5 గంటలకు పైగా కొనసాగింది, చివరికి షార్ప్ షూటర్ల చేతిలో మ్యాన్ ఈటర్ టైగర్ హతమైంది.