Moradabad, July 05: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతున్నది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Consumer affairs ministry) ప్రకారం పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) పురులియా (Purulia) ప్రాంతంలో మాత్రం అత్యధికంగా రూ.155కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లో కిలో టమాటా ధర రూ. 150కి చేరింది. కేవలం టమాటా మాత్రమే కాదు మిగిలిన కూరగాయల ధరలకు కూడా మండిపోతున్నాయి. అన్నింటి ధరలు దాదాపు వందకు చేరువయ్యాయి. ఎండల తీవ్రత పెరగడం, రుతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Uttar Pradesh: Tomato prices soar to Rs 150 per kg in Moradabad.
The price of vegetables has increased a lot. Tomatoes are being sold at Rs 150 per kg. Customers are facing a lot of problems due to the price hike. I request the government to intervene and regularise the… pic.twitter.com/YlatOnjCnS
— ANI (@ANI) July 5, 2023
కాగా, ముంబైలో (Mumbai) అతితక్కువగా కిలో రూ.58 పలుకుతుండగా, ఢిల్లీలో (Delhi) రూ.110, చెన్నైలో (Chennai) రూ.117, కోల్‌కతాలో రూ.148కి (Kolkata) చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.83.29కు లభిస్తున్నదని పేర్కొంది.
Jharkhand | "The price of tomatoes has increased everywhere. Petrol is cheaper than tomatoes now. It has become extremely difficult for us to manage expenses now," said a customer from Ranchi. pic.twitter.com/TdlWprbl9x
— ANI (@ANI) July 5, 2023xt
అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది. ఢిల్లీలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లిన్‌కిట్ వంట్ ఆన్‌లైన్ షాపింగ్ అప్లికేషన్స్ కిలో రూ.140 అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.