New Delhi, July 14: దేశంలో టమాట ధరలు కొండెక్కాయి. కిలో వంద నుంచి రెండొందల వరకు ధరలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలపై మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఒక నాగుపాము టమాటాలకు రక్షణగా ఉన్నది (snake protecting tomatoes). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీర్జా ఎమ్‌డీ ఆరిఫ్ అనే ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఒక ఇంట్లో టమాటాలున్న చోటుకు ఒక నాగుపాము చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత ఖరీదైనవిగా ఉన్న టమాటాలకు కాపాలాగా ఉన్నది. వాటి దగ్గరకు వచ్చే వారిపై దాడి చేసి కాటేసేందుకు పడగ విప్పుతుంది. ‘నిధి కంటే విలువైన టమాటాలను పాము రక్షిస్తున్నది’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
View this post on Instagram
కాగా, టమాటాలకు రక్షణగా ఉన్న పాము వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా స్పందించారు. ‘టమాటాలు చాలా ఖరీదైనవి, వాటిని ముట్టుకోవద్దు’ అని ఒకరు కామెంట్ చేశారు. విలువైన టమాటాలకు పాము కాపాలాగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే తమ తమ ప్రాంతాల్లో టమాట ధరలను కొందరు ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.