Tripura Assembly Ruckus. (Photo Credits: Twitter | ANI)

అగర్తల, జూలై 7: గత మార్చిలో అసెంబ్లీలో అధికార బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అశ్లీల వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది. బాగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లక్‌నాథ్‌ గతంలో అసెంబ్లీలో పోర్న్‌ వీడియో చూసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో అదే అంశాన్ని ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ ఎమ్మెల్యే అనిమేశ్‌ దెబ్బర్మ లేవనెత్తారు.

దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు, 18న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ఇక సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఐదుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం త్రిపుర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశామని, ఆ తర్వాత విపక్షాలు వాకౌట్ చేశాయని ఓ అధికారి తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ బిస్వా బంధు సేన్ బడ్జెట్ సమావేశాల సమయంలో "అవాంతరాలు సృష్టించిన" కారణంగా సీపీఐ(ఎం) శాసనసభ్యుడు నయన్ సర్కార్, కాంగ్రెస్‌కు చెందిన సుదీప్ రాయ్ బర్మన్ మరియు ముగ్గురు టిప్రా మోతా ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. సస్పెండ్ అయిన ముగ్గురు టిప్రా మోతా శాసనసభ్యులు బృషకేతు దెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ దెబ్బర్మ ఉన్నారు.

Here's ANI Videos

మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు. డెబ్బర్మ ఈ అంశంపై వాయిదా తీర్మానం తీసుకురావాలనుకున్నారు, కానీ స్పీకర్ దానిని అనుమతించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఉంచాలని ఆర్థిక మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్‌ను కోరారు.

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ, పరువునష్టం కేసులో రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

స్పీక‌ర్ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తిప్ర మోతా ఎమ్మెల్యేలు జ‌డ‌బ్ లాల్ అంశంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌కు దిగారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఆందోళనకు దిగారు. అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ మొదట విపక్ష సభ్యులను సభ లోపల తమ నిరసనను ఆపాలని కోరారు. సస్పెన్షన్‌ను పునఃపరిశీలిస్తానని చెప్పారు, కాని వారు వాకౌట్ చేయడంతో, సేన్ ఆర్డర్‌ను సవరించలేదు.