Bridge Collapses In Bihar: బీహార్‌లో ఆగని ప్రమాదాలు, నిర్మాణంలో ఉండగానే కూలిన మరో బ్రిడ్జి, ఏళ్లుగా సాగుతున్న పనులు, నాసిరకంగా నిర్మాణం
తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ (Bridge Collapses)కూలినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు.
Patna, June 26: బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ (Bridge Collapses)కూలినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తున్నదని అన్నారు. కిషన్‌గంజ్, కలిహార్‌ను అనుసంధానం చేసే ఈ వంతెనను మెచ్చి నదిపై నిర్మిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Pillar of an under-construction bridge on Mechi River which connects Katihar and Kishanganj districts in Bihar, caves in near Gori village on NH-327E. pic.twitter.com/VsYAP9xnl7
— ANI (@ANI) June 24, 2023
కాగా, జూన్ 4న బీహార్‌లోని (Bihar) ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఖగారియా జిల్లాను భాగల్పూర్‌తో అనుసంధానించే ఆ వంతెన పేకముక్కలా పడిపోయింది. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు మరణించాడు. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఆ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై బీహార్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తైన, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలకు ‘స్ట్రక్చరల్ ఆడిట్’ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
(The above story first appeared on LatestLY on Jun 24, 2023 09:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

