Punjab CM Bhagwant Mann with Governor Banwarilal Purohit (PTI)

Sexual Misconduct Charges: సాటి మగాడితో అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ సూచించారు.ఈ నీచమైన నేరానికి పాల్పడిన ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు.

ఘోర విషాదం, సోదరి చితిమంటల్లో దూకిన అన్న, 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువకుడు

కాగా గురుదాస్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి తనను మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌ లైంగికంగా వేధిస్తున్నారని ఇటీవల National Commission for Scheduled Castes (NCSC)లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాబ్‌ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని పోలీసుశాఖ నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

Video

బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. 2013-14లో ఫేస్‌బుక్‌ద్వారా పంజాబ్ మంత్రి కటారుచక్‌ బాధితుడికి పరిచయమయ్యారు. అప్పటి నుంచి అతడిని మంత్రి లైంగికంగా వేధించడం ప్రారంభించారు. తనకు పలుకుబడి ఉందని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడికి హామీ ఇస్తూ కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. 2021 వరకూ ఇలా అసహజ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. మొదట్లో తన వయసు తక్కువగా ఉండటంవల్ల ఇవన్నీ అర్థం చేసుకోలేకపోయానని బాధితుడు తెలిపారు.