IMD issues red and orange alerts in almost every state: నైరుతి రుతుపవనాల రాకతో దేశ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహాలు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో (Rains) రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పలుచోట్ల మరణాలు సైతం వెలుగుచూశాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పడిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.ఢిల్లీకి అరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. దాదాపు 25కు పైగా ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పంపుల ద్వారా నీటిని తొలగిస్తున్నారు.
విద్యాశాఖ కార్యాలయాల్లో జీన్స్,టీషర్ట్ పై నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న బీహార్ విద్యాశాఖ
మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. బుధవారం ముంబయిలోని మలాద్ ప్రాంతంలో వర్షాలతో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కౌశల్ దోషి (38)గా గుర్తించామని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని థానే , పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, దీంతొ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలినట్లు చెప్పారు. మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా రోడ్లు మూసేశారు. బుధవారం భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలోపడిపోవడంతో నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లోనూ పలు నగరాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
గుజరాత్ రాష్ట్రాన్నీ భారీ వర్షాలు ముంచెత్తాయి. నవ్సారి, వల్సాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మరియు దాని పరిసర ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి, సాధారణ జనజీవనం ప్రభావితమైంది మరియు ఉదయం కార్యాలయ వేళల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంగా నది దక్షిణ మరియు ఉప-హిమాలయన్ నార్త్ బెంగాల్‌లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తరాఖండ్ నూ గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై 5వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్‌తోపాటు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గోవాలోని కొన్ని ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిశాయి, వాతావరణ శాఖ గురువారం వరకు కోస్తా రాష్ట్రానికి 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది. సూచన నిర్దిష్ట ప్రదేశాలలో తీవ్రమైన జల్లులను అంచనా వేస్తుంది.