Tohana, Jan 9: జిలేబీ బాబా..ఇప్పుడు ఈ పేరు న్యూస్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈయన ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు. పూజల పేరుతో 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాంత్రిక విద్యలు (tantrik of Haryana) తెలుసంటూ మహిళలను లొంగదీసుకుని వారితో కామవాంఛలు తీర్చుకున్నాడు. ఇతని ఆగడాలపై కొందరు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి (raped 120 women) పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ (sentence to be pronounced soon) తాజాగా తీర్పు వెలువరించింది.ఈ జిలేబి బాబా పూర్యాపరాల్లోకి (Who is Jalebi Baba) వెళితే.. జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ అమర్‌వీర్. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతంగా పోలీసులు తెలిపారు.
అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్‌వీర్ రెండేళ్లు కనపడకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తనకు తాంత్రిక విద్యలు తెలుసంటూ చుట్టుపక్కల వాళ్లని నమ్మించాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్‌నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు.
అక్కడకు వచ్చే మహిళలకు మాయమాటలు చెప్ని లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని చెప్పి అనంతరం వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్‌మెయిల్ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కామ లీలలు బయటకు వచ్చాయి.