Shadnagar, Jan 6: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని షాద్ నగర్ లో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడై కూతురుని గర్భవతిని (impregnated by father in Shadnagar) చేశాడు. భార్యను కోల్పోయిన అతను.. కుమార్తెపైనే ప్రతి రోజూ అత్యాచారం (Minor girl raped) చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షాద్‌నగర్‌లో నివాసముంటున్న ఓ 40 ఏండ్ల వ్యక్తి నిర్మాణ రంగంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య మూడేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆ వ్యక్తికి ఒక కూతురు ఉంది. ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. మద్యానికి బానిసైన తండ్రి, భార్య లేకపోవడంతో సుఖం కోసం కూతురిపై కన్నేశాడు.తాగి వచ్చి ప్రతి రోజు కూతురిపై అత్యాచారం చేస్తూ, తన కోరికలను తీర్చుకుంటున్నాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
రోజూలాగే గురువారం పాఠశాలకు వెళ్లిన బాలికకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అప్రమత్తమైన టీచర్లు, ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, గర్భిణి అని తేలింది. టీచర్లు షాక్‌కు గురై పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.