VJY, Jan 6: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.దుకాణంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి (Man attempt to rape of a woman) ప్రయత్నించారు. ఈ ఘటన జిల్లాలో (Krishna district) కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన మహిళ (35) కోడూరులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది.
ఆమె ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఉదయం దుకాణానికి వచ్చి పని ముగించుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సదరు మహిళ దుకాణంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్‌బేగ్‌పేట సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆమె చీరకొంగును పట్టుకొని లాగాడు. దీంతో మహిళ బైక్ పైనుంచి కింద పడిపోవడంతో ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు.
జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తి గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి, సీసీ టీవీ పుటేజీ వైరల్
అయితే మహిళ కేకలు వేసేందుకు ప్రయత్నించడంతో నిందితుడు ఆమె ముఖం, చేతిపై దాడి చేసి, నోరు మూసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రహదారి వెంట వెళ్తున్నవారు మహిళ కేకలు విని అటుగా వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల మహిళ కాలుకు బలమైన గాయం, చేతికి, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అవనిగడ్డ సీఐ శ్రీనివాస్ బాధిత మహిళను అడిగి తెలుసుకున్నారు. కోడూరు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. కోడూరు, నాగాయలంక పీఎస్‌లకు సంబంధించిన పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.