Newdelhi, Dec 21: భారత్ లో ప్రధాన గుర్తింపు కార్డుగా (Identity Card) చెప్పుకొనే ఆధార్ (Aadhar) లో సమూల మార్పులు రానున్నాయి. 18 ఏండ్లు వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ (UIDAI) సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాస్ పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవడంతో పాటు జిల్లా, సబ్ డివిజనల్ స్థాయిల్లో నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం జిల్లా ప్రధాన పోస్టాఫీసులు, ఇతర ఆధార్ కేంద్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
The Unique Identification Authority of India (UIDAI) has announced that those above 18 years and wanting Aadhaar made for the first time will now be subjected to physical verification#ommcomnewshttps://t.co/jnwKGLiSxH
— Ommcom News (@OmmcomNews) December 21, 2023
ఆధార్ జారీకి 180 రోజులు?
ఆధార్ కోసం తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలపై డాటా క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. అనంతరం, సర్వీస్ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్ కు పంపిస్తారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లియరెన్స్ వచ్చిన 180 రోజుల్లోపు ఆధార్ జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనలన్నీ 18 ఏళ్లకు పైబడి తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే. ఆధార్ కార్డు జారీ అయ్యాక సాధారణ పద్ధతుల్లోనే వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.