Newdelhi, May 21: ప్రజాధరణలో (Popularity) ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో (Global Leader Approval Rating) అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు (America) చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' (Morning Consult) నిర్వహించిన సర్వే (Survey) ప్రకారం ప్రధాని మోదీ 78 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ 10వ స్థానంలో నిలిచారు. 22 దేశాల సీనియర్ నేతలను అధిగమించి ఇలా మోదీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
PM Modi tops approval ratings with 78 % popularity among all world leaders as per Morning Consult survey https://t.co/4S6ByD1IAB
— MSN India (@msnindia) May 20, 2023
సర్వేలో ఎవరు ఎక్కడ?
ఈ సర్వేల 4 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. 78 శాతం మంది ప్రజలు మాత్రం తమ మొదటి ఎంపికగా ప్రధాని మోదీని ఎంచుకున్నారు. ఆ తర్వాత స్విస్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ కు 62 శాతం మంది రెండోస్థానాన్ని కట్టబెట్టారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మూడో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు 53 శాతం మంది ఓట్లు వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మలోనీ 49 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నారు.